![]() |
![]() |

బిగ్ బాస్ అగ్నిపరీక్ష చాలా హాట్ హాట్ గా జరుగుతోంది. కామనర్స్ ని 15 మందిని ఈ న్యూ బిగ్ బాస్ సీజన్ లో ఇంట్లోకి పంపించడానికి రెడీ అయ్యింది టీమ్. ఐతే ఇప్పటివరకు ఒక ఆరుగురిని స్టార్టింగ్ లోనే జడ్జెస్ సెలెక్ట్ చేశారు. అందులో శ్రీజ అనే వసపిట్ట కూడా ఉంది. డబ్బా రేకుల రాణి అంటూ తన గురించి తానె చెప్పుకుంది కూడా. ఐతే హోల్డ్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుంచి ఇంకా కొంతమందిని సెలెక్ట్ చేయడానికి డేర్ ఆర్ డై లెవెల్ 1 లో కొన్ని టాస్కులు ఇచ్చి ఆడించారు హోస్ట్ అండ్ జడ్జెస్. అందులో హోల్డ్ లో ఉంచిన కల్కి అనే అమ్మాయికి షకీబ్ అనే అబ్బాయి మధ్య శ్రీముఖి ఒక ఇంటరెస్టింగ్ టాస్క్ ని పెట్టింది. ఈ డేర్ చేయాలంటే ఒకరు స్టూడియో నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసరికి షాకిబ్ వెళ్ళిపోయాడు.
అప్పుడు కల్కికి టాస్క్ చెప్పింది. తెల్సిన ఫ్రెండ్ ఎవరికైనా ఫోన్ చేసి ఎంతైనా అమౌంట్ ని తన అకౌంట్ లో వేయించుకోమని చెప్పింది. అలా కల్కి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి 90 వేలు వేయించుకుంది. ఇక షాకిబ్ ని పిలిచి అదే టాస్క్ ఇచ్చారు. అతని సైడ్ నుంచి మొదట 10 వేలు వచ్చాయి. ఐతే అంత తక్కువ కాదు ఒక మ్యాగ్జిమమ్ అమౌంట్ అని మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చి వేయించుకోమని ఛాన్స్ ఇచ్చారు. అలా సెకండ్ ఛాన్స్ లో 50 వేలు షకీబ్ అకౌంట్ లో వేయించుకున్నాడు. ఐతే షకీబ్ అకౌంట్ లో 60 వేలు కల్కి 90 వేలు . ఐతే ఇది అన్ ఫేర్ అంటూ షాకిబ్ చెప్పాడు. తర్వాత గెలిచిన ఆరుగురి నుంచి ఇది అన్ ఫేర్ అనిపిస్తుందా అంటూ శ్రీముఖి అడిగింది. శ్రీజ చెయ్యెత్తి అన్ ఫేర్ అని చెప్పింది. తర్వాత షకీబ్ ని నవదీప్ అడిగాడు. కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పాడు. ఇక శ్రీజను నవదీప్ అడిగాడు ఎలా అన్ ఫేర్ అని. కల్కికి టాస్క్ గురించి క్లియర్ గా ఎక్ష్ప్లైన్ చేసారు షాకిబ్ కి చెప్పలేదు అంది శ్రీజ. ఎవరిదీ తప్పు...అతను కన్ఫ్యూజ్ అయ్యాడనే సెకండ్ చాన్సు ఇచ్చారు. సో అతను ఒక అమౌంట్ ని అడిగాడు. ఐతే ఇక్కడ నేను నీకు ఇస్తున్న సలహా ఏంటంటే అతిగా ఆలోచించకు. బిగ్ బాస్ వందల ఎపిసోడ్స్ వందల లాంగ్వేజస్ లో చేశారు. ఒకే నా నువ్వు ఊపుకుంటా ఒక ఊరు నుంచి వచ్చి యాక్చ్యువల్లి ఇది అన్ ఫేర్ అని చెప్పడానికి నీకంత సీన్ లేదు. ఇంకోసారి ఇలాంటివి చేయకు. నేనైతే సరదాగా చెప్పి పంపిస్తా కానీ తర్వాత అది నీకే చాల డేమేజ్ అవుతుంది ఇక ఐపోయింది. వెళ్లి కూర్చో అని శ్రీజకు నవదీప్ గట్టిగానే క్లాస్ ఇచ్చాడు నవదీప్.
![]() |
![]() |